1 July, 2026 | 9:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ

01-07-2026 08:17 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లయన్స్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాత బాలకృష్ణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.అదే విధంగా క్లబ్ నూతన సెక్రటరీగా ఖాలీద్, ట్రెజరర్గా విఠల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. క్లబ్ పెద్దలు, సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి పదవీ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పాత బాలకృష్ణ మాట్లాడుతూ... సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి లయన్స్ క్లబ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి పలువురు ప్రముఖులు, క్లబ్ సభ్యులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన నాయకత్వంలో క్లబ్ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు.