హైదరాబాద్ గల్లీల్లోని ముగ్గురు స్నేహితుల కథ
02-07-2026 12:14 AM
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూ రు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అమీర్ లోగ్’. దర్శకుడు రమణారెడ్డి సోమ తెరకెక్కించారు. మాధవిరెడ్డి సోమ నిర్మించారు. తాజాగా ఈ మూవీ హక్కుల్ని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకుంది. ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనుంది. హైదరాబాద్ గల్లీలోని ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ, ఇదని టీమ్ పేర్కొంది.






