1 July, 2026 | 9:16 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు

01-07-2026 08:08 PM

కోదాడ,(విజయక్రాంతి): లంబాడా హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో బుధవారం గిరిజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియా నాయక్ సంస్థ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కోటియా నాయక్ మాట్లాడుతూ... మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో సాగిన ప్రత్యేక గ్రామపంచాయతీ ఉద్యమం గిరిజనుల్లో చైతన్యం నింపిందని అన్నారు.

అనంతరం సంస్థ ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపకుడు జాతీయఅధ్యక్షుడు బెల్లయ్య నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ విద్యా సంస్థ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, ఎమ్మెస్ విద్యా సంస్థ సి ఓ సేకు శీనుబానోతు నందలాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడురాజు, నాయక్, జిల్లా అధ్యక్షుడురవి నాయక్, సైదా నాయక్, నిఖిల్, నాగేంద్ర, తిరుమల్, చాంద్ పాషా, సతీష్, కృష్ణ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.