ట్రంప్ సంపద 11వేల కోట్లపైనే!
కనకవర్షం కురిపించిన క్రిప్టో కరెన్సీ
వాషింగ్టన్, జూలై 1: అమెరి కా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ క్రి ప్టోలో పెట్టుబడి న పెట్టుబడులు భారీ ఎత్తున లా భాలను తెచ్చిపెట్టింది. 2025లో 1.2 బిలియన్ డాలర్లు (రూ.11,358 కోట్లు) ఆర్జించినట్లు గవర్నమెంట్ ఎథిక్స్ కార్యాలయం తెలిపింది. 1978 చట్టం ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఆస్తులను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వెల్లడించిన ఆదాయ వి వరాలు బహిర్గతమయ్యాయి. 2024లో ట్రంప్ కుటుంబం క్రిప్టో ఫ్లాట్‌ఫామ్ ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ను ప్రారంభించారు.
క్రిప్టో టోకెన్ల ద్వారా ట్రంప్ ముగ్గురు కుమారులు 22.5 బిలియన్ల టోకెన్లను సొంతం చే సుకున్నారు. 2025 ఏప్రిల్‌లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒక కాయిన్‌ను సైతం ఆవిష్కరించింది. 2025లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ తన పేరిట డాల ర్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని తీసుకువచ్చారు. దీనికి సంబంధించి లైసెన్సింగ్ అగ్రిమెంట్ కింద 635 మిలియన్ డాలర్ల రాయల్టీలను అందుకున్నారు. ఎక్సేంజీ ట్రేడింగ్‌లో ఆ యన డాలర్లు పోగుచేశారు. క్రిప్టోతోపాటు, గోల్ఫ్‌క్లబ్, రిసార్ట్ ప్రాపర్టీల ద్వారా 290 మిలి యన్ డాలర్లకు పైగా ట్రంప్ ఆర్జించారు.






