calender_icon.png 24 February, 2026 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడి చేసిన గుండాలను అరెస్టు చేయాలి

24-02-2026 12:57:00 AM

జిల్లా న్యాయవాద పరిషత్ డిమాండ్ 

నిజామాబాద్ ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): బోధన్ బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది జి. కళ్యాణి పై  ఆదివారం రోజు రుద్రూర్ లో  గుండాల దాడి చేయడాన్ని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్  తీవ్రంగా ఖండిచారు. 

దాడి విషయమై న్యాయవాది రుద్రూర్  పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. ఇంతవరకు దుండగులను అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉదాసీన వైఖరి  అవలంబించడం శోషణీ యం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్గా మారు తున్నాయన్నారు.       

మహిళా న్యాయవాదిపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ కమిషనర్ ను  శాఖనున్యాయవాది పరిషత్ తరపున ఆయన కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయవాదులు సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు హత్యలు పెరిగిపోవడని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు న్యాయ వ్యవస్థ రక్షణకై ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకుని న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు, న్యాయవాది కళ్యాణి పై దాడి చేసిన గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.