1 March, 2026 | 1:23 PM

వెంకటప్పయ్య నాయుడు వచ్చాడు..

01-03-2026 12:29 AM

మనసును హత్తుకునే సినిమాలు అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో వస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పీ కిరణ్ నిర్మాత. మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు ప్రచార చిత్రాలతో సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల చేసిన చిత్రబృందం శనివారం మరో ప్రముఖ పాత్రను పరిచయం చేశారు. ‘వెంకటప్పయ్య నాయుడు’గా మోహన్‌బాబు నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో తెల్లటి కుర్తా ధోతి ధరించి గంభీరంగా నడిచి వస్తున్న ఆయన ఓ గ్రామపెద్దగా కనిపించారు. ఈ చిత్రానికి సమర్పణ: అశ్విని దత్; బ్యానర్: చందమామ కథలు; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; ఫైట్స్: రియల్ సతీశ్; ఎడిటర్: మాధవ్‌కుమార్ గుళ్లపాటి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.