పల్లకి సేవలో వట్టెం వెంకన్న
09-05-2026 04:14 PM
బిజినేపల్లి : మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అత్యాద్భుతంగా నిర్వహించింది. శనివారం వేంకటేశ్వర స్వామి వారి పర్వదినం సందర్భంగా అల్మెల్ మంగ గోదాదేవి సమేత అమ్మవార్ల పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించామని, భక్తులు పల్లకి సేవ కార్యక్రమంతో పరవశించి పోయారని ఆలయ కమిటీ తెలిపింది. పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పెద్ద సంఖ్యలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెళ్లిళ్లు జరిగాయి. వట్టెం, పాలెం గ్రామాలకు చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






