భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి
సూర్యాపేట జిల్లాకు 'బీఎన్' పేరు పెట్టాలని డిమాండ్
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రఖ్యాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి మరియు స్మృతి స్తూపానికి పూలమాలలు వేసి గ్రామస్తులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు.
ఆయన ఆశయ సాధన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లు కపోతం రెడ్డి, తుంగతుర్తిలో మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. బీఎన్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఎన్ కీర్తిని, ఆయన చేసిన పోరాటాలను భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు, నూతనంగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లాకు 'భీమిరెడ్డి నరసింహారెడ్డి' పేరు పెట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






