28 July, 2026 | 2:50 AM

మల్లన్న ఆలయంలో వరుణ యాగం

28-07-2026 01:49 AM

కొమురవెల్లి, జులై 28: సకాలంలో  వర్షాలు  కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మహాగణపతి పూజ, గౌరీ పూజ, మహాగణపతి హోమం, రుద్ర హోమం, వరుణ మూల మంత్ర పఠనం, పూర్ణాహుతి కార్యక్రమాలు   నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శత ( 108 )ఘటాలతో స్వామి వారి మహా స్నపనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.