రోడ్డు మరమ్మతులు చేపట్టాలి
సీపీఎం నాయకుడు మహిపాల్
జహీరాబాద్, జూలై 27 : జహీరాబాద్ నుండి తాండూర్ వెళ్లే రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజల ఇబ్బందులు తీర్చాలని సిపిఎం పార్టీ జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్ మహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు మహిపాల్ తన కార్యకర్తలతో కలిసి జహీరాబాద్ నుండి తాండూర్ వెళ్లే రోడ్డును పరిశీలించారు. జహీరాబాద్ నుండి షేకాపూర్ మల్చల్మ సిద్దాపూర్ వరకు జహీరాబాద్ ఏరియాలోకి వస్తుందని ఆ రోడ్డు గుంతల మయంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల నుండి అనేకమంది ప్రజలు తమ అవసరాలు నిమిత్తం జహీరాబాద్ వెళుతుంటారని, తరచు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా సిద్ధాపూర్ మల్చల్మ వెంకటాపూర్ జాడి మల్కాపూర్ తదితర గ్రామాల నుంచి జహీరాబాద్ లోని వివిధ పరిశ్రమలలో పనిచేసేందుకు కార్మికులు వెళ్తుంటారని తెలిపారు. రాత్రి వేళలో కోహిర్ మండలంలోని సిద్దాపూర్, బడంపేట, పర్షపల్లి, జహీరాబాద్ మండలం మల్చల్మ, మల్చల్మ తాండ, షేకాపూర్, విట్టు నాయక్ తండా తదితర ప్రాంతాల నుంచి జహీరాబాద్ కు వివిధ పరిశ్రమలలో పనిచేసేందుకు కార్మికులు వెళ్తుంటారని రాత్రి వేళల్లో షిఫ్ట్ ముగించుకొని వస్తున్న కార్మికులకు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ రోడ్డు గుంతలను పూడ్చి మరమ్మత్తులు చేసి కొత్త బీటీ రోడ్డు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మించని సమక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లేశం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.






