ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
09-07-2026 12:41 AM
నాగిరెడ్డిపేట్, జులై 8 (విజయక్రాంతి): మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించి కాపాడాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి మొక్కల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్, కార్యదర్శి శంకర్, ఎక్సైజ్ ఎస్త్స్ర జలీల్, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






