భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తా
కార్మిక భవన నిర్మాణానికి వజ్రేశ్ యాదవ్ సానుకూలత
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల కొరకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తానని మేడ్చల్ డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేశ్ యాదవ్ ను జవహర్ నగర్ డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ వారితో మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రత్యేకంగా లేబర్ అడ్డా' స్థలం కేటాయించాలని అక్కడ భవన నిర్మాణానికి సహకరించాలని వారు వినతిపత్రం అందజేశారు.
కార్మికుల విజ్ఞప్తిపై వజ్రేశ్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, కార్మికుల సమస్యలను వివరించారు. త్వరలోనే అధికారులతో క్షేత్రస్థాయిలో సమావేశమై, భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరియు ఇతర అనుమతులు లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ సంఘ ప్రతినిధులు అధ్యక్షులు చెన్నాపురం యాదయ్య, గౌరవ అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్ సభ్యులు సలహాదారులు రమణ రెడ్డి, మల్లేష్ (ఏ ఐ ఎఫ్ టీ యూ, కోశాధికారి కోట్ల చెన్నా రెడ్డి, మరాఠి బాబు, ఐలయ్య పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ వారితో స్పష్టం చేశారు.




