భారత్ మరో ముందడుగు
- ఆటోమొబైల్ రంగంలో ‘కేటో మోటార్స్’ అద్భుతం
- తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్ ఆవిష్కరణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): కిక్లీన్ ట్రాన్స్‌పోర్టు, స్వదేశీ సాంకేతికత, హరి త ఇంధన రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశీయ దిగ్గజ సంస్థ కేటో మోటార్స్ తన మొట్టమొదటి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్‌ను బేగంపేటలో ఆదివారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. దేశంలోని రద్దీని, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ 9-మీటర్ల ఎలక్ట్రిక్ బస్‌ను ఆపరేటింగ్ పార్టనర్‌కు అందజేశారని చెప్పారు.
‘ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ రంగాల్లో దేశం అద్భుతమైన మార్పులను చూస్తోందని ఈ వేదిక ద్వారా స్పష్టమైంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కేంద్రం సం పూర్ణ మద్దతు ఇస్తోంది’ అని అన్నారు. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయం మాత్ర మే కాదు, ఇది దేశం ఇంధన భద్రత, కాలుష్య నియంత్రణ, దిగుమతుల తగ్గింపు, సాంకేతిక ఆత్మనిర్భరతకు బలమైన బాటలు వేస్తోంది’ అన్నారు.
ఈ క్రమంలో కోల్ ఇండియా, నే వేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సంప్రదాయ బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లోకి విస్తరిస్తూ జాతీయ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్లు, డిఫెన్స్, ఏఐ రంగాలకు వెన్నెముకగా నిలిచే లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్ వం టి క్రిటికల్ మినరల్స్కు చమురుతో సమానమైన వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం రూ. 34 వేల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను చేపట్టింది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫార్మా, ఐటీ, డిఫె న్స్‌లో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ డిజైన్ హబ్‌గా మారుతోంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలు తమ డిజైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా.. తెలుగు యువ ఇంజనీర్లు ప్ర పంచ స్థాయి చిప్లను తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెమికాన్ ఇం డియా ప్రోగ్రామ్’ ద్వారా చిప్ తయారీ, రీసెర్చ్, డిజైన్ రంగాలకు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి’ అని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ అగ్రగామి
‘మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నేడు దేశం లో వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో 99.2 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, ఎగుమతులు 11 రెట్లు పెరగగా.. ఈ రంగం ద్వారా సుమారు 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. పీఎల్‌ఐ పథకాలు, స్థిరమైన పారిశ్రా మిక విధానాలతో కేంద్రం ఎలక్ట్రానిక్స్ రంగానికి పూర్తి స హకారం అందిస్తోంది. ప్రపంచంతో పోటీపడుతూ అద్భుతమైన మౌలిక వసతులు, రోడ్లతో దూసుకుపోతున్న భారత్.. ’వికసిత భారత్ - 2047’ లక్ష్య సాధన దిశగా పయనిస్తోంది. కేటో మోటార్స్ సాధించిన ఈ విజ యం స్వదేశీ సామర్థ్యానికి నిదర్శనం’ అని కిషన్‌రెడ్డి అన్నారు.






