3 August, 2026 | 3:58 AM

హైడ్రాపై సుప్రీంకు

03-08-2026 02:35 AM
  1. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్
  2. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్!
  3. హైడ్రా అధికారాలపై తేల్చుకోనున్న సర్కారు
  4. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై హైడ్రా వాదనలు?
  5. సుప్రీం తీర్పుతో హైడ్రా అధికారాలపై స్పష్టత!

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాలాలు, ప్రభు త్వ భూముల ఆక్రమణల తొలగింపును అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీల క న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. హైడ్రా అధికారాలపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీర్పు పూర్తి కాపీని న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్ కార్యాలయం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ట్లు సమాచారం.

తీర్పులోని చట్టపరమైన అంశాలపై సీనియర్ న్యాయ నిపు ణులతో చర్చించిన అనంతరం స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయనున్నట్లు అధికార వర్గాలు చెపుతు న్నాయి. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది.

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలను గుర్తించి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. సామా న్యుల ఇళ్లతో పాటు రాజకీయ నాయకులు, వ్యా పారవేత్తలు, ప్రముఖులకు చెందిన నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవడంతో హైడ్రా దేశవ్యాప్తంగా చర్చనీ యాంశమైంది. ప్రభుత్వం దీనిని ‘హైదరాబాద్‌ను భవిష్యత్ వరదల విపత్తుల నుంచి రక్షించే కార్యక్రమం‘గా అభివర్ణిస్తే, ప్రతిపక్షాలు మాత్రం ‘బుల్డోజర్ పరిపాలన‘గా విమర్శించాయి.

ఈ నేపథ్యంలో హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయిం చారు. నోటీసులు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా కూల్చివేతలు చేపడుతున్నారని, హైడ్రాకు స్వతంత్రంగా అలాంటి అధికారాలు లేవని, చట్టబద్ధ ప్రక్రియలు పాటించడం లేదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ అంశాలపై విచా రణ జరిపిన హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్య లు చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపుతట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

‘హైడ్రా’పై ప్రభుత్వం వాదన

ప్రభుత్వం ప్రధానంగా మూడు అం శాలను సుప్రీంకోర్టు ముందుంచే అవకాశం ఉంది. హైడ్రా అనేది కొత్తగా చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ కాదని, ఇప్పటికే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, పోలీసు తదితర శాఖ లకు ఉన్న అధికారాలను సమన్వయం చేసే ప్రత్యేక వ్యవస్థ మాత్రమేనని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. దీంతోపాటు చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల వల్ల ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ తీవ్ర జలమయమవు తోందని, నగర ప్రణాళిక పూర్తిగా దెబ్బతింటోందని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షిం చడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేయనున్నట్టు తెలుస్తోంది.

పర్యావరణ పరిరక్షణ, ప్రజా వనరుల సంరక్షణ, నగర భద్రత వంటి అంశాలు వ్యక్తిగత ప్ర యోజనాల కంటే ముఖ్యమైనవని, అందుకే వేగవంతమైన చర్యల కోసం హైడ్రా అవసరమైందని ప్రభుత్వం వివరించే అవకాశ ముంది. హైకోర్టు తీర్పు ప్రభావం కేవలం హైడ్రాపై మాత్రమే కాదు. భవిష్యత్తులో ప్ర భుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక అమలు సం స్థల అధికారాలపై కూడా ఈ తీర్పు ప్రభా వం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థలకు ఎంత అధికారం ఉంటుంది? ప్రజల ఆస్తి హక్కులు ఎంతవరకు రక్షించాలి?

నోటీసులు, విచారణ, అప్పీల్ వంటి సహజ న్యాయ సూత్రాలు తప్పనిసరా? వంటి ప్రశ్నలకు ఈ కేసు కేంద్ర బిందువుగా మారింది. అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారంపై ఎలాంటి సందేహం లేకపోయినా, ఆ అధికారాన్ని వినియోగించే విధానం మా త్రం పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలని కోర్టు లు పదేపదే చెపుతున్నాయి. అందుకే హై కోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలాం టి దృక్పథాన్ని అవలంబిస్తుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

రాజకీయంగానూ కీలకమే!

హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిన తర్వాత ‘అక్రమ నిర్మాణాలపై రాజీ లేదు’ అనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే ఇదే అంశంపై హైకోర్టు తీర్పు రావడం, ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వం వాదనల ను సమర్థిస్తే హైడ్రాకు మరింత చట్టపరమైన బలం లభించే అవకాశం ఉంది.

మరోవైపు హైకోర్టు తీర్పును సమర్థిస్తే ప్రభుత్వం హై డ్రా పని విధానంలో మార్పులు చేయాల్సి రావచ్చు. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక చ ట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నా యి. సుప్రీంకోర్టు తీర్పు హైడ్రా భవిష్యత్తును మాత్రమే నిర్ణయించదు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అక్రమ నిర్మాణాల తొలగింపునకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సంస్థల అధికారాలపై ఒక న్యాయపరమైన ప్రమాణాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.

అలాగే ప్రభుత్వ పరిపాలనా అధికారాలు, పర్యావరణ పరిరక్షణ, పట్టణాభివృద్ధి, పౌరుల హ క్కుల మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే అంశంపై కూడా ఈ తీర్పు మార్గదర్శకంగా నిలవొచ్చు. మొత్తంగా హైడ్రాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సాధారణ అప్పీల్ మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ పరిపాలనా విధానంతో పాటు ప్రభుత్వ అధికా రాల పరిధి వంటి అనేక కీలక అంశాలపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న న్యాయపోరాటంగా మారుతోంది.