7 March, 2026 | 8:28 PM

మహిళల కోసం యూరాలజీ కేంద్రం

06-03-2026 12:00 AM

ఏఐఎన్యూ బంజారాహిల్స్‌లో ఆల్-వుమెన్ ఓటీ ఆవిష్కరణ

మహిళల ఆరోగ్య సాధికారతకు ముందడుగు: శిఖా గోయల్

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): మహిళల యూరాలజీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బంజారాహిల్స్‌లోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సెంటర్ ఫర్ ఫంక్ష నల్ అండ్ ఫీమేల్ యూరాలజీ’ను ప్రారంభించింది.

ముఖ్య అతిథిగా ఐపీఎస్ శిఖా గోయెల్ హాజరయ్యారు. ఈ కేంద్రంలో మూడు ముఖ్య విభాగాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అవసరం లేకుండా పెల్విక్ కండరాల బలపరిచే పునరావాస కార్యక్రమం, అలాగే మూత్రాశయ పనితీరును అంచనా వేసే యూరోడైనమిక్ పరీక్షల సదుపాయం అందుబాటులో ఉంచారు.