3 May, 2026 | 2:28 AM

గరీబోళ్లకు అండగా ఉప్పల ఫౌండేషన్

03-05-2026 01:10 AM

నాగోల్, మే ౨ (విజయక్రాంతి): నాగోల్‌లోని ఉప్పల క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కొండపాకకి చెందిన తండ్రి లేని (అమ్మాయి) దివంగత బుచ్చయ్య తల్లి గజ్జె లచవ్వ కుమార్తెకి చీర, పుస్తె, మట్టెలు పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఆయన సతీమణి ఐవీఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న అందజేశారు.

అమ్మాయి వాళ్ల తల్లి కూలి పని చేస్తుందని, పేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. తమ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా పుస్తే, మట్టెలు అందజేస్తానని అన్నారు. కార్యక్రమంలో అమ్మాయి వాళ్ల మేనమామ సురేష్, దళిత సంఘం నాయకులు లింగం పాల్గొన్నారు.