కామారెడ్డి ఎమ్మెల్యేకు నోటీసులు
- పరువు నష్టం కేసులో చర్యలు
- న్యాయవాది సుమంత్ వెల్లడి
కామారెడ్డి, మే 2 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం కేసు విషయంలో న్యాయపరమైన చర్యలు ప్రారంభమైనట్టు న్యాయవాది గరక రాజుల సుమంత్ తెలిపారు. శనివారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాంపల్లి ప్రజాప్రతినిధు ల కోర్టులో పరువు నష్టం దావా వేసినట్టు వారి తరపు న్యాయవాది గరక రాజుల సుమంత్ తెలిపారు.
కామారెడ్డి మున్సిపాలిటీ ఫలితాల నేపథ్యంలో ఫిబ్రవరి 17, 21తేదీలలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తనయుడు మహమ్మద్ ఇలియాస్‌పై అసత్యమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారన్నారన్నారు. ఇలియాజ్‌పై రేప్ కేసులు ఉన్నాయని, అసత్యమైన ఆరోపణలు అని తెలిసి మీడియాలో ప్రచారం చేశాడని తెలిపారు.
ఇందుకుగాను ఇలియాసుద్దీన్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారని గరకరాజుల సుమంత్ తెలిపారు. ప్రాథమిక విచా రణ అనంతరం ఈ నెల 20న ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకావాలని హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయ స్థానం నోటీసులు జారీ చేసిందని తెలిపారు. న్యాయవాది సుమంత్‌తో పాటు వారి న్యాయవాదుల బృందం గంగరాజం, స్టీఫెన్ రాజు, సతీశ్, సూర్య పాల్గొన్నారు.






