3 May, 2026 | 2:28 AM

కష్టాలను వింటాం.. కన్నీళ్లను తుడుస్తాం

03-05-2026 01:09 AM

నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రజాదర్భార్‌లో మంత్రి పొంగులేటి 

నేలకొండపల్లి, మే 2 (విజయక్రాంతి): ‘మీ కష్టాలను వినేందుకు, మీ కన్నీళ్లు తుడిచేందుకే ప్రభుత్వం మీ గడప వద్దకు వచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు విశ్రమించం’ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.

శనివారం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ లో ఆయన పాల్గొని, గ్రామస్థులతో నేరుగా మమేకమయ్యారు. భూ సమస్యల ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందు లను రాబోయే రెండు నెలల్లో పరిష్కరించి, రైతులకు మేలు చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దివాకర్‌తో కలి సి మంత్రి గంటల తరబడి ప్రజల మధ్యే ఉండి వందలాది మంది ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతివారం దీనిపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.