8 July, 2026 | 9:11 PM

రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

08-07-2026 08:54 PM

ఎర్రుపాలెం(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు కాంగ్రెస్ శ్రేణులు చింతకాని మండలంలోని రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో బుధవారం నాడు చింతకాని మండలంలో పదవ తేదీన జరిగే రైతు ఆశీర్వాద సభకు మండలం నుండి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ అనుబంధ కార్యకర్తలు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని కావున మండలం నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని రైతులను ఆశీర్వదించాలని కోరారు.