పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
08-07-2026 08:56 PM
గంభీరావుపేట,(విజయక్రాంతి): బీజేపీ కేంద్ర, రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు (BLA-2) సమావేశం భాజపా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు, సిరిసిల్ల సహ ఇంచార్జ్ మల్లారపు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాలపై సమగ్రంగా చర్చిస్తూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.మండలంలోని ప్రతి బూత్‌ను బలపరచడం ద్వారా పార్టీని గ్రామస్థాయిలో మరింత శక్తివంతం చేయాలని, ఓటర్ నమోదు ప్రక్రియలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.






