30 August, 2026 | 3:12 AM

దివ్యాంగులకు దగా!

30-08-2026 01:29 AM
  1. 6 వేల పెన్షన్ ఏమైంది?
  2. ఒక్కొక్కరికీ 66 వేలు బాకీ
  3. బ్యాక్‌లాగ్పోస్టులు, రిజర్వేషన్ల హామీలు గాలికి
  4. అందాల పోటీలు, ఫుట్‌బాల్ సోకులకు కోట్లు.. సంక్షేమానికి కోతలా?
  5. వాగ్దానాలునెరవేర్చకుంటే మహా ధర్నా
  6. ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
  7. ఎల్బీనగర్‌లో సమర శంఖారావ సభ

హైదరాబాద్/ఎల్బీనగర్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ‘తెలంగాణలో ఉన్నది దయలేని ప్రభుత్వం. దివ్యాంగుల పట్ల కనీస మానవత్వం కూడా లేదు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి.. అమలు చేయకుండా దగా చేసింది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) విమర్శించారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.6 వేల పెన్షన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నో హామీలిచ్చి వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని 5లక్షల 11 వేలమంది దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ. 6 వేల చొప్పున లెక్కిస్తే ఒక్కొక్కరికీ రూ. 66 వేలు బాకీ పడిందని ఆరోపించారు. ఎన్నికల సమీపించే వేళ ఆరు నెలల పెన్షన్లు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, 

దివ్యాంగులు మీ మోసాలను మర్చి పోరు? అని హెచ్చరించారు. దివ్యాంగు లకు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? లేక మనసు లేదా? అని ప్రశ్నించారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ సోకులకు, మూసీ సుందరీకరణకు వంద ల, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో ఆర్భాటాలు చేయడానికి, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీవీల్లో మీ ఫొటోలతో ప్రకటనలు ఇచ్చుకోవడానికి కోట్లు ఉంటా యి, కానీ పెన్షన్లకు ఉండవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా,

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సమర శంఖారావం సభ నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు.

దివ్యాంగుల కష్టాలను గుర్తించిన కేసీఆర్.. రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.4,016కు పెంచారని గుర్తు చేశారు.  దివ్యాంగులను ఓటర్లుగా కాకుండా, కుటుంబ సభ్యులుగా చూశారని పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లు లు చెల్లిస్తే కమీషన్లు వస్తాయి.. దివ్యాంగుల కు పెన్షన్లు ఇస్తే కమీషన్లు రావనే ఉద్దేశంతో నే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించా రు.

ఆంధ్రప్రదేశ్‌లో మీ గురువు దివ్యాంగులకు నెలకు రూ.6 వేల వరకు పెన్షన్ ఇస్తు న్నారు, మరి నువ్వెప్పుడు ఇస్తావ్ అని ప్ర శ్నించారు. 33 నెలల కాలంలోనే రూ.30 వే ల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అ మ్మారని, అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తుల ను ముఖ్యమంత్రి తన సొంత తమ్ముడికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

‘రేవంత్‌రెడ్డి కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దం దాలు మాత్రమే తెలుసు.. మాకు ప్రజల ప క్షాన పోరాటాలు చేయడమూ తెలుసు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. దివ్యాం గులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని, లేదంటే  బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇంది రా పార్క్ వద్ద మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. 

అన్ని వర్గాలకు అన్యాయం

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశారని హరీశ్‌రావు మం డిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించి, మాయమాటలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి  కమీషన్లు, కాంట్రాక్టులపైనే ధ్యాస త ప్ప.. బాధల్లో ఉన్న ప్రజలను పట్టించుకునే తీరిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు, జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, 24 గంటల కరెంటు, యూరి యా, రైతుబంధు నిధుల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా చలనం లేదని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకా లను కూడా నిలిపివేసే కుట్ర జరుగుందని ఆరోపించారు.

‘హైడ్రా’ కూల్చివేతలను ఆపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఎందు కు నిలిపివేయడం లేదని ప్రశ్నించారు. పేద ల పథకాలకు వచ్చేసరికి కోర్టు సాకులు, కూ ల్చివేతలకు విషయంలో బుల్డోజర్ల దాష్టీకమా? అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాల ను, మోసపూరిత వాగ్దానాలను సోషల్ మీ డియా వేదికగా ప్రజలందరికీ తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం మూడు అంశాలపై బీఆర్‌ఎస్ తరఫున కీలక కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశా ల్లో దివ్యాంగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరా బాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించేందుకు త్వరలో తేదీ ఖరారు చేస్తామ ని వెల్లడించారు. 

అలాగే కేసీఆర్‌తో మాట్లా డి బీఆర్‌ఎస్ దివ్యాంగుల విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.