30 August, 2026 | 12:21 AM

Breaking News

ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్   •   స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం   •   కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్   •   గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి   •   నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు   •   కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు   •   దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం   •   రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు   •  

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకే ఎన్నికలు

08-07-2026 08:51 PM

ఆల్ఫోర్స్ లో విజయవంతంగా హౌస్ ఎలక్షన్స్ 

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు పోటీ తత్వాన్ని పెంచేందుకే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హౌసె ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులకు హౌసెస్ ఎలక్షన్స్ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలో  నాలుగు గ్రూపుల మధ్య సంవత్సర కాలం పాటు వివిధ రంగాల్లో పోటీలను నిర్వహించడంతో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

దీంతో వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు ధ్రువ, లక్ష ,తేజస్ ,సరస్ గ్రూపుల మధ్య పోటీలు నిర్వహించగా విద్యార్థులు కెప్టెన్, వైస్ కెప్టెన్ల కోసం పోటీపడ్డారు. సాధారణ ఎన్నికల మాదిరిగా వారికి సింబల్స్ కేటాయించి ఎన్నికల తీరును ఏర్పాటు చేయక విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.సాధారణ ఎన్నికలు ఎలా ఉంటాయో విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే నిర్వహించడంతో విద్యార్థులకు పూర్తి అవగాహన కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు,  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకులు  తదితరులు పాల్గొన్నారు.