14 August, 2026 | 1:57 AM

నేడు పూలే దంపతుల విగ్రహావిష్కరణ

14-08-2026 12:43 AM

పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు దానం, నవీన్

ఖైరతాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): బీసీల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు బీ సీ నాయకులకు విజయవంతమైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా మహాత్మా జ్యోతిబా పూ లే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నెక్లెస్ రో డ్డులోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చే సింది. నేడు సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. అందుకు సంబంధిం చిన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్‌లు గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.a