రియల్ ఎస్టేట్‌కు బ్రేకుల్లేవ్!
- డిమాండ్ తగ్గదు.. రేట్లు దిగవు
- ప్రీమియం మార్కెట్ వైపు హైదరాబాద్ పరుగులు
- నాణ్యమైన ప్రాజెక్టులపైనే కొనుగోలుదారుల గురి
- భరోసానిస్తున్న ‘క్రెడాయ్’
- 28 నుంచి 30 వరకు హైటెక్స్‌లో ప్రాపర్టీ షో
- ఉద్యోగ అవకాశాలే రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు ప్రధాన బలం
- క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు జైదీప్ రెడ్డి, అధ్యక్షుడు జగన్నాథ్ రావు హేమ సింగులూరి
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తరిస్తున్న దశ నుంచి పరిణితి చెందిన, ప్రీమియం కేంద్రీకృత, ఎంపిక ఆధారిత మార్కెట్‌గా రూపాంతరం చెంపతోంది. ఇళ్ల కొనుగోలులో ధర ఒక్కటే ప్రామాణికం కా కుండా.. నాణ్యత, ప్రాజెక్టుపై నమ్మకం, అనుమతులు, పత్రాలు, కుటుంబ అవసరాలు కీలకంగా మారుతున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జైదీప్ రెడ్డి, అధ్యక్షు డిగా ఎన్నికైన బి.జగన్నాథ్ రావు స్పష్టం చేస్తున్నారు.
కోటి రూపాయలకు పైబడిన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందన్న అంశాన్ని మొత్తం మార్కెట్‌కు వర్తింపజేయకుండా, కొనుగోలుదారులు ముందుగా తన బడ్జెట్‌ను నిర్ధారించుకుని, అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించిన తర్వా తే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రీమియమైజేషన్‌కు ఆకర్షితులై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంటిని ఎంచు కోవాలని అంటున్నారు.
ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్న 19వ క్రెడాయ్ హైదరా బాద్ ప్రాపర్టీ షో2026కు వారి సందేశం ప్రధానాంశంగా నిలవనుంది. ఈ ప్రదర్శనలో 100కు పైగా రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులు రానున్నాయి. ఒకే వేదికపై డెవలపర్లను కలుసుకుని, వివిధ ప్రాపర్టీలను పోల్చి చూసే అవకాశం కొనుగోలుదారులకు లభించనుంది. బ్యాంకుల నుంచి ఆర్థిక సలహాలు కూడా పొందవచ్చు.
అయోమయం వద్దు
ఒక వీకెండ్ మమ్మల్ని కలవండి. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా, అయోమయం లేకుండా మీ కు కావాల్సిన ఇంటిని ప్లాన్ చేసుకోండి అని జైదీప్‌రెడ్డి సూచించారు. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో ఫలానా ఫ్లాట్ తీసుకోవాలా, వద్దా? అనిశ్చితిని తగ్గించడమే ప్రాపర్టీ షో ఉద్దేశమన్నారు. ఒకే చోట అన్ని ప్రాజెక్టులను పరిశీలించి, డెవలపర్లతో నేరుగా మాట్లాడి, ఆర్థిక సంస్థల సలహాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రముఖ రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగా ఉందని, మార్పులకు అనుగుణం గా అభివృద్ధి చెందుతోందని జగన్నాథ్ రా వు పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని, ప్రీమియం విభాగం గణనీయంగా విస్తరిస్తుందన్నారు. నైట్ ఫ్రాంక్ గణాంకాల ప్రకా రం, 2026 తొలి అర్ధభాగంలో హైదరాబాద్‌లో 19,249 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఒక శాతం పెరిగిందన్నారు.
ఇదే సమయంలో కొత్తగా ప్రారంభమైన యూనిట్లు 2 శాతం తగ్గి 20,466కు చేరాయి. 2026 తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో సగటు వెయిటెడ్ రెసిడెన్షియల్ ధర చదరపు అడుగుకు సుమారు రూ.8,211గా నమోదయ్యి ంది. గతేడాదితో పోల్చితే.. దాదాపు 9 శాతం పెరిగింది. నగరంలో నిర్మాణ కార్యకలాపాలు భారీగా కొనసాగుతున్నందున, ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందవద్దని జగన్నాథ్‌రావు తెలిపారు.
పెరుగుతున్న సెకండ్ సేల్స్
నగరంలో సెకండ్ సేల్స్ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టులు పూర్త వుతున్న కొద్దీ.. ప్రారంభ దశలో ఇండ్లు కొ నుగోలు చేసిన వారు వాటిని తిరిగి విక్రయిస్తున్నారు. లగ్జరీ రియల్ ఎస్టేట్ విషయంలో హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు ముంబైతో పోటీ పడే స్థాయికి చేరిందని జగన్నాథ్‌రావు పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌లోనే నివసించే వారు ఈ నగరంలో విలువను ముం దుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
కోకాపేట్, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రి క్ట్ వంటి ప్రాంతాలు ప్రీమియం రియల్ ఎస్టేట్‌కు కీలక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, హైదరాబాద్ వృద్ధి పశ్చిమ కారిడార్‌కే పరిమితం కాదని క్రెడాయ్ అభిప్రాయపడుతోంది. కొంపల్లి, పటాన్‌చెరు, వాయవ్య హైదరాబాద్, దక్షిణ విమానాశ్రయ కారిడార్, ఆదిభట్ల, కొంగరకలాన్ వంటి ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది.
నిర్ణయించేది మౌలిక వసతులే
భవిష్యత్తులో ఆస్తి విలువను రోడ్లు, రవా ణా సౌకర్యాలు, ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ తో అనుసంధానం, మెట్రో విస్తరణ, అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ వంటివి ప్రభావితం చేయనున్నాయి. అమల్లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులు పొందిన ప్రాజెక్టులు, ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టుల మధ్య తేడాను కొనుగోలుదారులు గుర్తించాలని క్రెడాయ్ హెచ్చరిం చింది. రెరా అనుమతి ఒక్కటే సరిపోదని, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు, చెరువులు, హైడ్రా కు సంబంధించిన అంశాలనూ పరిశీలించాలని స్పష్టం చేసింది.
అనుమతి ఉంటే.. అమ్ముడుపోయినట్టు కాదు
అనుమతి ఉంటే.. అమ్ముడైపోయినట్టుగా భావించకూడదని వారు తెలిపారు. సమావేశంలో వెలువడిన ముఖ్యమైన హెచ్చరికల్లో ఇదొకటి. అనుమతి పొందిన ప్రాజెక్టును అమ్ముడు పోయినట్టుగా భావించకూడదని, అసలు అమ్ముడు పోయినదానితో సమానం చేయకూడదని వారన్నారు.
అనుమతి పొందిన ప్రతిదీ అమ్ముడవదు అన్నది క్రెడాయ్ సందేశం. కొనుగోలుదారులు ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు, అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ, వాస్తవంగా జరిగిన విక్రయాలు, భవిష్యత్తుకు సంబంధించిన హామీలు వీటన్నింటినీ వేర్వేరుగా పరిశీలించాలి. సోషల్ మీడియాలో వస్తున్న ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మకుండా, ప్రాపర్టీ డేటా, ప్రాజెక్ట్ వివరాలను అధికారికంగా ధృవీకరించిన తర్వాతే భారీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని క్రెడాయ్ నేతలు సూచించారు.
విస్తరిస్తున్న ఉద్యోగావకాశాలే బలం
హైదరాబాద్‌లో భవిష్యత్ గృహ డిమాండ్ ప్రధానంగా ఉద్యోగాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. జీసీసీలు, బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, తయారీ రంగం, ఫ్యూచర్ సిటీ వంటి రంగాలు ఐటీ సెక్టార్‌ను మించి నగరంలో ఉద్యోగ అవకాశాలను విస్తరిస్తున్నాయి. 2026 తొలి అర్ధభాగంలో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు భారీగా పెరుగున్నట్టు, కొత్తగా ఏర్పడుతున్న ఉద్యోగ కేంద్రాల చుట్టూ గృహ డిమాండ్ కొనసాగడానికి అనుకూల సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లు దూకుడుగా వెళుతున్నాయనేకంటే.. స్థిరమైన వృద్ధిని సూచిస్తున్నాయనే చెప్పవచ్చు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై నమ్మకం
‘రేట్లు తగ్గవు.. డిమాండ్ తగ్గదు’ అనే క్రెడాయ్ నినాదాన్ని ధరలు పెరుగుతాయనేదానికి హామీగా చూడాల్సిన అవస రం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉన్న బలమైన అంశాలపై అచంచల నమ్మకంగా దీన్ని చూడాలి. సాధారణ కొనుగోలుదారుడికి ‘ధరలు మరింత పెరగకముందే కొనండి’ అనేది అసలు సందేశం కాదు. సరైన డెవలపర్ నుంచి, సరైన ప్రాంతంలో, సరైన ప్రాపర్టీని ఎంచుకుని, అన్ని పత్రాలు, అనుమ తులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలనేదే తమ అసలైన సందేశమంటూ స్పష్టం చేశారు. ప్రాపర్టీ షోలో కొనుగోలుదారులకు తగిన సమాచారం అందించి, సరైన నిర్ణయం తీసుకు నేలా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం.






