స్టైఫండ్ ఎందుకు పెంచలేదు?
- ఆయుష్ విద్యార్థులతో సర్కార్ చెలగాటం
- అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
- టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): ఆయుష్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆయుష్ విద్యార్థులకు అత్యంత తక్కువ స్టైఫండ్ ఇస్తున్నార న్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో స్టైఫండ్ పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణలో విద్యార్థులు అర్ధాకలితో అలమటించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ జాయింట్ యాక్షన్ కమి టీ ఆధ్వర్యం లో స్టైఫండ్ పెంపు కోసం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాకు గురువారం తీన్మార్ మల్లన్న హాజరై తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ‘వర్క్ లోడ్ తక్కువ ఉంది’ కాబట్టి తక్కువ స్టైఫండ్ ఇస్తున్నామనే ప్రభుత్వ వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక పార్టీ సమస్య కాదని, గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు అందరూ విద్యార్థులను వంచించినవారేనని మల్లన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంలో తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.రాబోయే శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ఈ అంశాన్ని బలం గా ప్రస్తావిస్తామని మల్లన్న హామీ ఇచ్చారు.
రాజ్యాధికార పార్టీలో చేరికలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ రా జ్యాధికార పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు పెద్ద సం ఖ్యలో టీఆర్పీలో చేరారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండెల్, రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మ డి మెదక్ జిల్లా ఇంచార్జ్ నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఆ ర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నూతనం గా పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్. భవన వెంకటేష్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాబోయేది బీసీల రాజ్యమే
తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా బాని సలుగా కాకుండా, పాలకులుగా ఎదగాల్సిన సమయం వచ్చిందని తీన్మార్ మల్ల న్న స్పష్టం చేశారు. ‘సర్జికల్ స్ట్రైక్ 59’లో భాగంగా నాలుగు కీలక నియోజకవర్గాలైన కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొ ండ, హుజూరాబాద్‌లలో గణాంకాలను విడుదల చేస్తూ, బీసీ సమాజం ఏ విధంగా మోసపోతుందో ఆయన వివరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 33% నుంచి 23%కి తగ్గించి, 10% రిజర్వేషన్లకు కోత పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ‘ముదిరాజ్ తల్లి పాలు తాగి పెరిగాను’ అని చెప్పి బీసీల ఓట్లు దండుకున్నారని విమర్శించారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు కోట్ల మంది బీసీలను వంచించారని దుయ్యబట్టారు. బీసీలను బానిసలు గా కాకుండా ఎమ్మెల్యేలుగా తయారు చేసే ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమేనని, అందుకే జనగామ టికెట్‌ను ముదిరాజ్ బిడ్డకు లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి ముదిరాజ్‌కు కేటాయించామని చెప్పారు.సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పాద యాత్ర ప్రారంభించనున్నట్లు మల్లన్న ప్రకటించారు.2028 నాటికి తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో బీసీ జెండా పాతాలని, బీసీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు.






