నల్సార్ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయొద్దు!
- అన్నిరాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ
- సీజేఐ సూర్యకాంత్ పర్యటన వ్యతిరేక ప్రచారంపై వర్సిటీ నివేదిక ఇవ్వాలని లేఖ
- కొద్ది గంటల్లోనే బ్యాన్ ఎత్తివేత
న్యూఢిల్లీ, ఆగస్టు 13: హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ నుంచి 2026లో న్యాయ పట్టా పొందిన విద్యార్థులను తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అడ్వకేట్లుగా నమోదు చేయవద్దని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) చైర్మ న్ మనన్ కుమార్ మిశ్రా గురువారం అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించారు. అలాగే, నల్సార్ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిపిన ప్రచారంలో పాల్గొన్న వారిపై నివేదిక సమర్పించాలని యూనివర్సిటీని కోరారు.
అయితే ఆ తరువాత కొద్ది గంటల్లోనే బీసీఐ సమావేశమై అమాయక విద్యార్థులకు నష్టం కలగకూడదని బ్యాన్ ఎత్తివేస్తున్నట్టు తెలిపిం ది. గతవారం, యువతపై సీజేఐ చేసిన వ్యా ఖ్యల కారణంగా, స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థుల ప్రచారంపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీసీఐ చైర్మన్.. సీజేఐ పర్యటనను వ్యతిరేకించినవారిని గుర్తిస్తూ 3 రోజుల్లో ధ్రువీకరించి న నివేదిక ఇవ్వాలని నల్సార్ వీసీని కోరారు.
సీజేఐ పర్యటనను వ్యతిరేకిస్తూ ప్రచారాన్ని ప్రారంభించినవారు, మీడియా ద్వారా ప్రచా రం చేసినవారు, సమావేశాలు నిర్వహించినవారు, ప్రజలను సమీకరించినవారు, కాన్వొ కేషన్.. సంబంధిత కార్యక్రమాలను బహిష్కరించాలని, అడ్డుకోవాలని, సమిష్టిగా పాల్గొనకూడదని పిలుపునిచ్చినవారిని గు ర్తించాలని బీసీఐ నల్సార్‌ను కోరింది.
విద్యా ర్థి సంఘాలు, అధ్యాపకులు, పరిశోధక వి ద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బయటి వ్య క్తుల ప్రమేయంపై వివరాలు కూడా కోరింది. న్యా య విద్య నియంత్రణ సంస్థగా భారత బార్ కౌన్సిల్ ఇలాంటి పరిస్థితిని చూస్తూ మౌనం గా ఉండదని బీసీఐ చైర్మన్ ఒక లేఖలో పేర్కొన్నారు. వైస్- చాన్సలర్ నివేదిక అందిన తర్వాత ఆగస్టు 19న ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.






