మంత్రిని కలిసిన చీకోడ్ మాజీ సర్పంచ్
ముస్తాబాద్,ఆగస్టు 13( విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామం మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు..సిద్దిపేట నుండి ముస్తాబాద్,చీకోడ్, ముచ్చర్ల,లింగన్నపేట మీదుగా కామారెడ్డికి ఆర్టీసీ బస్సులు వెళ్ళేవి.ఈ గ్రామాల ప్రజలు బస్సుల సౌకర్యం ఉండడం వలన ఎలాంటి ఇబ్బంది
లేకుండా తమ పనులు, వ్యాపారం చేసుకునే వారు.కానీ చాలా కాలంగా బస్సు రావడం లేదని తెలిపారు.ఎన్నో సార్లు డిపో మేనేజర్ కు కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు.అయినా ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు మంత్రికి తెలియజేసి మా ఊరి మీదుగా ఆర్టిసి బస్సు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు.ఈ విషయం పై మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.






