9 April, 2026 | 7:31 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ

09-04-2026 05:23 PM

ఎస్ జీ ఎఫ్ ఆధ్వర్యంలో టై, బెల్టులు, బ్యాడ్జీలు పంపిణీ

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం  బొమ్మనపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని  మంగ్యాతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం  సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో ఈ పాఠశాలలో పనిచేసి, అకాల మరణం చెందిన  టీచర్ ఉమారాణి జ్ఞాపకార్థం ఆమె భర్త కరుణాకర్ రెడ్డి  మంగ్యాతండా పాఠశాలలో కృష్ణశిలతో చేసిన శ్రీసరస్వతి అమ్మ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, టేకులపల్లి ఎంఈఓ జగన్, సర్పంచ్ తారా చంద్, కాంప్లెక్స్ హెచ్ఎం మంగీలాల్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్(ఎస్జీ ఎఫ్ ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్టులు, టై, బ్యాడ్జీలు అందజేశారు. పాఠశాల హెచ్ఎం మంగూలాల్, టీచర్ వీరన్నల సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య, సిఆర్పి అబ్బయ్య, ఎస్జీఎఫ్ మెంబర్ నాగభూషణం, ఎండీఎం వర్కర్ అంలీ, స్వచ్ఛ మిత్ర జ్యోతి, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.