కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?
నోటికొచ్చినట్లు మాట్లాడితే సరిపోతుందా
కేరళలో మన నేతల అబద్ధాల ప్రచారం
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఎక్కడైనా ఎప్పుడైనా ఇష్టము సారంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం ఎంతవరకు సమంజసం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మీడియాతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రుల కేరళ ఎన్నికల ప్రచారంలో మన మంత్రులు పూర్తిగా అబద్ధాలు చెబుతూ అక్కడి ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం లో ఆరు గ్యారెంటీల(Congress Guarantees) అమలు లేదని, కేవలం కాంగ్రెస్ నేతల మాటల్లోనే అమలు అవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
కేరళం లో మాత్రం అన్ని చేసేసాం అని ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ మంత్రులు కేరళంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి మోసం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. తెలంగాణ ను లూటీ చేసిన విధానం చెప్పడానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. కేరళ సీఎం విజయన్ గారు స్వాతంత్య్ర సమరయోధుడని అతనిపై ఇష్టం సారంగా మాట్లాడడం మంచి విధానం కాదన్నారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ,స్వాతంత్ర సమరయోధుడు విజయన్ గౌరవం ఇవ్వకుండా ఎవరు పడితే వారు ఇష్టనుసారంగా మాట్లాడడం మానుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాలు,వాటా ల పంచాయతీ, సెటిల్మెంట్ లు ఎలా చేయాలో చెప్తున్నారా?అని అసహనం వ్యక్తం చేశారు.
కేరళ ప్రజలు చాలా తెలివిగలవారు... అక్షరాస్యులని మన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్ని అబద్ధాలు చెప్పినా అక్కడివారు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఢిల్లీ కి వాటాలు, ఎన్నికలు అయ్యే రాష్ట్రాలకు తెలంగాణ సొమ్ము పోతుందని ఆరోపించారు. ఇక్కడ దోచుకున్న సొమ్ము దేశమంతా పంచుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మోడల్ అంటే కేరళ కూడా దివాళా తీస్తుందన్నారు. ఇప్పటికైనా చేసింది చెప్పాలని అబద్ధపు మాటలు చెబుతూ కాలం వెళ్లదీయకూడదు అని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు.




