25 July, 2026 | 2:50 PM

సంస్మరణ సభ పోస్టర్ల ఆవిష్కరణ

25-07-2026 02:02 PM

మరిమడ్లలో దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి 

కోనరావుపేట, జూలై 25(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ నిర్మాతలు(Architects of the Communist Revolutionary Movement) కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు(Comrade Devulapalli Venkateswara Rao), తరిమెల నాగిరెడ్డి సంస్మరణ సభ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ఆటిపాముల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ నెల 30న హుస్నాబాద్‌లో నిర్వహించనున్న సంస్మరణ సభకు రైతులు, కార్మికులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుడు జింక సుధాకర్, కుమ్మరి దిలీప్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.