25 July, 2026 | 2:49 PM

రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు

25-07-2026 01:59 PM

మల్లాపూర్, జూలై 25(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామం మీదుగా వెళ్లే మెట్ పల్లి–ఖానాపూర్ ప్రధాన రహదారిపై(Metpally–Khanapur Main Road) గత ఐదు సంవత్సరాలుగా ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగా రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా త్వరలోనే ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రహదారికి శాశ్వత పునరుద్ధరణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీంతో స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.