4 July, 2026 | 3:33 AM

సేవా పథంలో ‘ఐక్యత’

04-07-2026 02:36 AM
  1. తలకొండపల్లిలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
  2. ఎమ్మెల్యే కసిరెడ్డిని ఆహ్వానించిన టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి 

ఆమనగల్లు, జులై 3(విజయక్రాంతి): పేదల కంటి వెలుగు కోసం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలకొండపల్లిలో  నేటి నుంచి ప్రతిష్టాత్మక మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం కానుంది. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించా ల్సిందిగా  ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణ రెడ్డి ని ఫౌండేషన్ చైర్మన్ , టాస్క్ సీ ఓ ఓ సుంకిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు:

ఈ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి  మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి సామాజిక దృక్పథం అభినందనీయమని కొనియాడారు. ఈ శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, కార్యక్రమానికి వస్తానని సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, భూపతి రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, బృంగి ఆనంద్ కుమార్, యాట నరసింహ, రాహుల్, సురభి వెంకటేశ్వర్ రావు మరియు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.తలకొండపల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు.