30 August, 2026 | 12:21 AM

Breaking News

యోగాతో మానసిక శారీరక శక్తి పెరుగుతుంది   •   ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్   •   స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం   •   కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్   •   గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి   •   నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు   •   కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు   •   దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం   •   రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్   •  

22 లక్షల మొండి బకాయిలు వసూలు

29-08-2026 11:40 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోనీ మండల సమాఖ్య కార్యాలయంలో సమైక్య సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సమాఖ్యల పనితీరు, సంస్థాగత నిర్మాణం,బ్యాంకు లింకేజి, స్త్రీనిధి రుణాల రికవరీ,రుణాల పంపిణీ గురించి లోకోస్ ఆప్లో సంఘాల వివరాల ఎంట్రీ, అజీవిక రిజిస్టర్, న్యూ ఎంటర్ ప్రైజెస్,నాన్ ఫాం కార్యక్రమాలు, స్కూల్ పిల్లల యూనిఫాంలు, టాస్ బిసి మహిళలకు కుట్టు మిషన్ లు, ప్రభుత్వ ద్వారా చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు, విఓఏల పనితీరు సెర్ప్ ద్వారా చేపట్టే వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది.

మండలంలో స్త్రీ నిధి రుణాల రికవరీ మెరుగు పడడం జరిగిందని మిగిలిన రుణాల రికవరీ కూడా త్వరలో పూర్తి చేయాలని చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో సిబ్బంది మరియు సబ్ కమిటీల ద్వారా రికవరీ డ్రైవ్ నిర్వహించి ఈ నెలలో సుమారు 22 లక్షల పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లు జరిగినట్లు ఏపియం దత్తు తెలిపారు. అదే విధంగా మండలంలో ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారినపడకుండా వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బెస్త శాంత, కార్యదర్శి మంజుల, యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్, ఎఫ్ఓ గౌరవ్ షిండే,సీసీలు శ్రీనివాస్, నజీర్,రవి,సావిత్రి,పెంటయ్య,స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ అమల, అకౌంటెంట్ రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.