30 August, 2026 | 12:42 AM

కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్

30-08-2026 12:10 AM

బోథ్,(విజయక్రాంతి): కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ జి నగేష్ పేర్కొన్నారు. శనివారం గ్రామంలో నూతనంగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే మన భారతదేశం లో హైందవ సంస్కృతి ఎంతో గొప్పది అన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు 30 లక్షల సిసి రోడ్డు ఆలయ ఆవరణలో పది లక్షలతో షెడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల కన్వీనర్ బోరి రవీందర్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి గంగాధర్ రావు, రైల్వే బోర్డు మాజీ సభ్యులు జీవీ రమణ బోత్ బజారత్నం మండలాల సహకార సంఘం చైర్మన్ లు కదం ప్రశాంత్ వెంకన్న గ్రామ సర్పంచ్ ఆకుల అనిత రాజేందర్ ఆలయ కమిటీ అధ్యక్షులు కుమ్మరి భోజన్న, నానం భోజ రెడ్డి, మునిగల రమేష్ ,జి వెంకటరమణ, నాణమ్ రమణ బిజెపి నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ ,సుధాకర్ రెడ్డి ,గాదె శంకర్ , చట్లఉత్తం, విష్ణు,, రాజేశ్వర్, భోజన్నతోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.