30 August, 2026 | 1:27 AM

ఘనంగా ధ్యాన్‌చంద్ జయంతి

30-08-2026 12:18 AM

ఆర్‌బీవీఆర్‌ఆర్ హైస్కూల్‌లో నిర్వహణ

నిజామాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఆర్‌బీవీఆర్‌ఆర్ హైస్కూల్‌లో శని వారం ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలకు సొసైటీ గౌరవ అధ్యక్షులు ఎ ప్రవీణ్‌రెడ్డి, గౌరవ సెక్రటరీ వెంకట రమణారెడ్డి, కోశాధికారి ఎస్ సాయరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ పి జగత్‌రెడ్డి, హాస్టల్ కమిటీ ఐర్మన్ ఎ అమర్‌జిత్‌రెడ్డి, విద్యా కమిటీ సభ్యులు ఉమామహేశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు, అడిషనల్ హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయబృందం పాల్గొన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు అంతర్గత వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగం గా మొదటి స్థానంలో షామ్‌రాక్స్, రెండవ స్థానంలో ఢాపిడెల్స్ నిలిచారు. ఈ విజయం సాధించిన విద్యార్థులందరికీ సొసైటీ సభ్యు లు బహుమతులను ప్రధానం చేశారు.