30 August, 2026 | 1:46 AM

డయాబెటిక్ పాదాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

30-08-2026 12:00 AM

మొయినాబాద్‌లో ఘనంగా ఐపాకాన్ 2026 

జాతీయ సదస్సు ప్రారంభం

మొయినాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): డయాబెటిస్ బాధితుల్లో పాదాల సమస్యలను ముందస్తుగా గుర్తించి, అవయవాల తొలగింపును నివారించడమే లక్ష్యంగా ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో మొయినాబాద్లోని ఫైర్ఫాక్స్ రిసార్ట్సో్ల రెండు రోజుల జాతీయ సదస్సు ఐపాకాన్ 2026 ప్రారంభమైంది.

ఏపీ ప్రభుత్వ విశ్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదాల చికిత్సను ప్రత్యేక వైద్య విభాగంగా గుర్తించి, వైద్య కళాశాలల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

డయాబెటిస్ కారణంగా అవయవాల తొలగింపును నివారించేందుకు ముందస్తు పరీక్షలు, ప్రజల్లో అవగాహన, వివిధ వైద్య విభాగాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఇండియన్ పోడియాట్రీ అసోసియే షన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఏపీఎస్ సూరి మాట్లాడుతూ.. డయాబెటిక్ ఫుట్ సమస్యలతో బాధపడుతున్న వారి కాళ్ల ను కాపాడటం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఐపాకాన్ లక్ష్యమన్నారు.

సద స్సులో డయాబెటిక్ పాదాల సంరక్షణ, గా యాల చికిత్స, రక్తప్రసరణ పునరుద్ధరణ, ఇన్ఫెక్షన్ల నియంత్రణ, పునరావాసం తదితర అంశాలపై నిపుణులు చర్చించనున్నట్లు తెలిపారు. పాదాల్లో సమస్యలు లేదా స్పర్శలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సం ప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీధర్, సైంటిఫిక్ హెడ్ డాక్టర్ జ్ఞానేశ్వర్, ఐపీఏ తెలంగాణ చాప్టర్ కార్యదర్శి రెజినాల్ డీ లామ్ తదితరులు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి సుమారు 400 మందికి పైగా వైద్య నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు సదస్సుకు హాజరయ్యారు.