30 August, 2026 | 1:20 AM

దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్

30-08-2026 12:16 AM

మంథని,(విజయక్రాంతి) మంథని మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన అప్పల పర్వతాలు తండ్రి అప్పల అంకుల్ దశదిన కార్యక్రమంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అప్పల అంకుల్‌తో ఉన్న అనుబంధాన్ని, ఆయన మంచితనాన్ని ఈ సందర్భంగా అయిలి ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుదుదుల వెంకన్న, నగరంపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఆరెంద సర్పంచ్ రామస్వామి, భట్టుపల్లి సర్పంచ్ స్వరూప–శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.