21 July, 2026 | 6:50 AM

కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి

20-07-2026 03:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): నీట్ పరీక్ష లీకేజీ కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని సిపిఎంఎల్ న్యూ మాస్ లైన్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజికవేత్త నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్య తీసుకోవాలని చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న రామ లక్ష్మణ్ గంగన్న గఫూర్ రాజేశ్వర్ గంగామణి తదితరులున్నారు.