9 August, 2026 | 1:23 AM

ఆటంకాలు లేకుండా అభివృద్ధి

09-08-2026 12:13 AM
  1. త్వరగా రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలి
  2. ఇంజినీర్లను త్వరగా భర్తీ చేయాలి
  3. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ఉన్న తాధికారులను ఐటీ, పరిశ్రమల మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. శనివారం స చివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాక ర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ఉమ్మ డి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.

నూతన రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న ర హదారుల మరమ్మతు పనులను త్వరిత గతి న పూర్తి చేయాలని అన్నారు. జిల్లాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, డిప్యుటేషన్‌పై వాటిని సాధ్యమై నంత త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమైన ని వాస ప్రాంతాల ప్రజలకు మరొక చోట ఇళ్ల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. 

అభివృద్ధి కార్యక్రమాల రూపక ల్పనలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీ సుకోవాలని సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అధికారులకు సూ చించారు. భూసేకరణ ఆలస్యం అవడం, అ టవీ భూముల బదలాయింపు వివిధాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.