9 August, 2026 | 2:27 AM

కామారెడ్డిలో భారీ చోరీ

09-08-2026 12:16 AM

16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90 వేల నగదు అపహరణ

కామారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాన్ని పగులగొట్టి బీరువాల్లో ఉన్న 16 తులాల బంగారు నగలు, 35 తులాల వెండి నగలు, 90 వేల నగదును దోచుకెళ్లారు. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న లైనింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సురేష్, లావణ్య దంపతులు ఇంటికి తాళం వేసి విద్య నగర్‌లో నివాసం ఉంటున్న తల్లిగారి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో శనివారం తిరిగి ఇంటికి వెళ్లేసరికి చోరీ జరిగినట్టు గుర్తించారు. దేవునిపల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి సిసిఎస్ టీం, క్లూస్ టీం, లు సందర్శించి వివరాలు సేకరించారు.