23వేల కొలువుల కోత
- పలు అమెరికన్ కంపెనీల నిర్ణయం
- ఆర్థిక మందగమనమే కారణం
వాషింగ్టన్, ఆగస్టు 8: అమెరికా ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు 23 ఉద్యోగాలలో కోత విధించాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ శుక్రవారం ఉపాధి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మే, జూన్‌కు సంబంధించిన సంఖ్యను సవరిస్తూ 2 నెలల్లో 1,03,000 ఉద్యోగాలకు తగ్గించింది. జూన్‌లో నిరుద్యోగితరేటు 4.2 శాతం నుంచి జూలైలో 4.1శాతానికి తగ్గింది.
గత నెలలో 2,64,000మంది అమెరికన్లు ఉద్యోగాన్వేషణ నిలిపివేశారని, మార్కెట్ నుంచి కార్మికులు నిష్క్రమించడమే ఇందుకు కారణంగా పేర్కొంది. 2021 తరువాత అత్యల్పం గా ఉద్యోగాలను వెతికే వారి శాతం 61.4 శాతానికి పడిపోయింది. కాగా ఆగస్ట్ నెలలో నిరుద్యోగ రేటులో మార్పు ఉంటుందని, కొత్తగా 83వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఉద్యోగ వృద్ధిలో మందగ మనం కొనసాగుతోందని బ్యూరో ఆఫ్ లేబ ర్ స్టాటిస్టిక్స్ స్పష్టం చేసిం ది. జూలై నెలలో విద్యారంగంలో 50వేల ఉద్యోగాలు కోల్పో గా, రిటైల్‌రంగంలో 19వేలు, ప్రైవేట్‌లో 30వేల ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొం ది. ట్రంప్ సుంకాల తరుణంలో ౪౯వేల ఉద్యోగాలు లభించాయని వెల్లడించింది.






