9 August, 2026 | 2:28 AM

నేడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

09-08-2026 01:22 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఇక శనివారం హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల్, కొమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జగిత్యాల్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వరంగల్, సిద్ధిపేట్, జోగులాంబ గద్వాల్, రాజన్న సిరిసిల్లా, నారాయణపేట్ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో మాత్రం అతితేలికపాటి వర్షాలు కురిశాయి.