9 August, 2026 | 2:26 AM

120 హాస్టళ్లు మంజూరు చేయాలి

09-08-2026 01:20 AM
  1. సీట్లు లభించక విద్యార్థుల అవస్థలు
  2. ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): కాలేజీల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారని, కొందరు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్ ప్లాట్‌పారాలపై నిద్రించే పరిస్థితి ఏర్పడిందని రాజ్యసభ సభ్యులు, జాతీ య బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే 120 బీసీ కాలేజీ హాస్టళ్లు,100 బీసీ గురుకుల పాఠశాలలు మం జూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసి నట్లు శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో మీడియాకు వెల్లడించారు. ఆయ న మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌గర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, మేడ్చ ల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వేలాది మంది విద్యార్థులకు హాస్టల్ సీట్లు దొరకడం లేదన్నారు. ప్రైవేట్ హాస్టళ్ల ఫీజులు భరించలేక విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రభు త్వం జిల్లాల వారీగా హాస్టళ్లను మంజూ రు చేయాలన్నారు.