9 August, 2026 | 2:26 AM

పీసీసీలో ఇద్దరికి కీలక పదవులు

09-08-2026 12:11 AM
  1. సేఫ్ ఎన్విరాన్‌మెంట్, సోషల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద
  2. సంఘటన్ సృజన్ అభియాన్ చైర్మన్‌గా గంప వేణుగోపాల్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కీలక నియా మకాలు చేపడుతూ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నేరెళ్ల శారదను సేఫ్ ఎన్విరాన్‌మెంట్, సోషల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్‌గా, గంప వేణుగోపాల్‌ను సంఘటన్ సృజన్ అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) చైర్మన్‌గా నియమించారు.

ఈ నియామకం ద్వారా గంప వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఏకి సంబంధించిన కార్యకలాపాలను సమన్వయం చేయడం, పర్యవేక్షించ డం, అమలు చేయడం ఆయన ప్రధాన బాధ్యతగా ఉండనుంది. వేణుగోపాల్ నియామకంతో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణను పెంచడంపై దృష్టి సారించనున్నారు.