9 August, 2026 | 4:06 AM

భారతీయులపై ఎండీఆర్ చార్జీలు లేవు!

09-08-2026 12:28 AM

ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళనలను తోసిపుచ్చుతూ, భారతీయ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని శనివారం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చే శారు. యూపీఐ లావాదేవీలపై చార్జీలు వి ధించేందుకు ఉద్దేశించిన ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007’ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం, దీని పై పలు రకాల విశ్లేషణలు, సత్యాలు, అసత్యాలు ప్రచారం అవుతుండడంతో  సమీర్ నిగమ్ స్పందించారు.

ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఫోన్‌పే ద్వారా భారతీయు లు జరిపే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించబోమని స్పష్టతనిచ్చా రు. రూ.2వేలు పైబడిన లావాదేవీలపై 0.25 శాతం నుంచి 0.4శాతం ఎండీఆర్(మర్చం ట్ డిస్కౌంట్ రేట్)ను ప్రతిపాదిస్తారని, ఆ భారాన్ని ఎవరు మోస్తారనే చర్చకు ఫోన్‌పే సంస్థ ఫుల్‌స్టాప్ పెట్టినట్లయ్యింది. వినియోగదారులు, చిరువ్యాపారులు ఎండీఆర్ చెల్లించనవసరం లేదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఎండీఆర్ బిల్లుపై ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టతనిస్తూ ఇది దుకాణదారులు, వర్తకులకే వర్తిస్తుందని, వినియోగదారులకు కాదన్నారు. దీనిద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలి క సదుపాయాలు, ఆవిష్కరణలు, భద్రతను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగిస్తాయని, అంతిమంగా యూపీఐ వినియోగదా రులందరికీ ఇది ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.