రాహుల్ X కిరణ్ రిజిజు
- మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ రగడ
- లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వాగ్యుద్ధం
- ‘ఎక్స్’ వేదికగా వాద ప్రతివాదాలు
- బిల్లుల ఆమోదానికి బేషరతుగా మద్దతు పలకాలని రిజిజు విజ్ఞప్తి
- డీలిమిటేషన్‌తో మహిళా కోటాకు లంకె ఎందుకని రాహుల్ నిలదీత
న్యూఢిల్లీ, ఆగస్టు 8: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు ప్రక్రియను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతో ముడిపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మ ధ్య వాగ్యుద్ధం నడుస్తున్నది. దీనిలో భాగంగానే శనివారం లోక్‌సభ ప్రతిపక్షనేత రాహు ల్‌గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మధ్య ‘ఎక్స్’ వేదిక గా తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
కిరణ్ రిజిజు తన సోషల్ మీడియా ద్వారా రాహుల్‌గాంధీ గతంలో మహిళల భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాధాన్యంపై ప్రసంగిస్తున్న వీడియోను పోస్టు చేస్తూ, మహిళల విషయంలో అప్పటికీ ఇప్పటికీ రాహుల్‌గాం ధీ మనసు మారిందని, ఆయన ఆలోచన సరళిలో మార్పు కనిపిస్తోందని చురకలంటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్ల మెంట్‌లో ఆమోదం పొందేందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర విపక్షాలు సంపూర్ణ మ ద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అ యింది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. గతంలో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ పేరిట రాహు ల్ గాంధీ ఓ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భా గంగా ఆ యన మహిళల భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ.. ‘భారత మహిళల శక్తి వంద ల ఏళ్ల నుంచి బందీగా ఉండిపోయింది. రా జకీయాలు, వ్యాపారాల్లోనే కాదు.. సొంతిం ట్లో కూడా మహిళలకు సరైన స్వేచ్ఛ లేదు. మహిళలు కనీసం వీధుల్లో ధైర్యంగా నడవలేకపోతున్నారు.
మహిళల ప్రాతినిధ్యం లేని ఏ వ్యవస్థ కూడా నిలబడలేదని నా విశ్వా సం. మహిళల భాగస్వామ్యం లేకపోతే, వారి కి తమ గళాన్ని వినిపించే అవకాశం రాకపో తే, భారత్ ఎప్పటికీ కుంటుప డిన స్థితిలోనే ఉంటుంది. ఈ విషయాన్ని మహిళలకు అర్థమయ్యేలా చెప్పడమే రాజకీయాల్లోనా పని’ అని రాహుల్ వ్యా ఖ్యానించారు.
రాహుల్‌గాంధీ ప్రశ్నలు..
కిరణ్ రిజిజు పోస్టుపై రాహుల్‌గాంధీ తీ వ్రంగా స్పందించారు. కిరణ్ రిజిజుకు స్ట్రాం గ్ కౌంటర్ ఇచ్చారు. నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు- 2023లోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తుచేశారు. చట్టం చేసి మూడేళ్లు గడిచినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానిని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఆ చట్టాన్ని అమలు చేయ టకుండా కాలయాపన చేస్తూ, ఇప్పుడు మళ్లీ దానిని డీలిమిటేషన్ బిల్లుతో ఎందుకు ము డిపెడుతున్నారో సమాధానం చెప్పాలని స వాల్ విసిరారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం నారీ శక్తి వందన్ అధిని య మ్ చట్టాన్ని అమలు చేయాలని డిమాం డ్ చేశారు. కిరణ్ రిజిజు ఇదే అంశంపై ఈ నెల 5న రాహుల్‌గాంధీతో సుమారు 50 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపా రు. మరుసటి రోజు ఫోన్ కాల్ చేసి కూడా సం ప్రదింపులు జరిపారు. నాడు కూడా రాహు ల్ గాంధీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఎంతమాత్రం స మ్మతం కాదు’ అని తేల్చిచెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు మరో వారం రోజులే గడువు ఉండట ంతో కేంద్రం ఎలాగైనా రెండు బిల్లులకు ఆమో దం సాధించాలని పట్టింపుగా ఉంది. అవి రాజ్యాంగ సవరణ బిల్లులు కావడంతో కచ్చితంగా పార్లమెంట్‌లో ఆమోదం పొం దాల్సి ఉంటుంది.
మూడింట రెండు వంతు ల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి సొంతంగా అంత బలం లేదు. కేం ద్ర ప్రభుత్వం అందుకే.. ప్రతిపక్షాల మద్ద తు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మ హిళా కోటాను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే కల్పించేందుకు ప్రయత్నిస్తున్నది.
చట్టంలో ఏముంది?
నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించాల్సి ఉంది. అయితే.. 2023లో ఆమోదించిన చట్టంలో భవిష్యత్తులో జరుగనున్న జనాభా లెక్కల (సెన్సెస్) తో ఈ రిజర్వేషన్ల అనుసంధానం జరిగింది. దీనివల్ల ఈ చట్టం అమలులోకి రావడానికి 2034 దాటే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చి, 2011 జనాభా లెక్కల ఆధా రంగానే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలటయ్యేలా చూ డాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.
బిల్లు ఆమోదం సాధించేందుకు కేంద్రం ఈ చట్టా న్ని డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి 850కి పెరుగుతుంది. దీనిలో 33 శాతం అనగా 273 స్థానాలు మహిళలకు దక్కుతాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే, జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.






