9 August, 2026 | 2:06 AM

సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి

09-08-2026 12:52 AM
  1. ప్రశ్నలు అడగడంతోనే ఆగిపోకూడదు
  2. గ్రాడ్యుయేట్లుగా మరింతమంది మహిళలు రావాలి
  3. చిప్స్ నుంచి షిప్స్ వరకు.. ఆవిష్కర్తలు యువతనే !
  4. ఢిల్లీ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ సందేశం

న్యూఢిల్లీ, ఆగస్టు ౮: ‘సవాళ్లును సమర్థం గా ఎదుర్కొని నిలబడిన వారినే విజయం వరిస్తుంది. నేటి యువతతరం శక్తిసామర్థ్యాలపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. యువత కేవలం ప్రశ్నలు అడగడంతోనే ఆగిపోకుండా సమస్యలకు పరిష్కారం కనుగొ నాలి. జీవితంలో నిరంతరం నేర్చుకునే తత్వ మే విజయాన్ని అందిస్తుంది. ప్రపంచం అ త్యంత వేగంగా మారుతున్నది. ఇలాంటి తరుణంలో సవాళ్లను అవకాశాలుగా మలచుకునేవారే నిజమైన విజేతలవుతారు’ అని ప్రధాని మోదీ సందేశమిచ్చారు.

దేశ రాజధానిలోని ఐఐటీక్యాంపస్‌లో శనివారం నిర్వ హించిన 57వ స్నాతకోత్సవానికి ఆయ న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందు గా క్యాంపస్‌లో ‘పరం ప్రజ్ఞ’ అనే ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారం భిం చారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణపతకం, డైరెక్టర్ స్వర్ణపతకం, శంకర్ దయాళ్‌శర్మ స్వర్ణపతకాలను ప్రదానం చేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ.. ఐఐటీలోకి మరింతమంది మహిళా గ్రాడ్యుయేట్లు రావాలని ఆకాంక్షించారు.

ఐఐటీ డిగ్రీ కేవలం సీజీ పీఏ లేదా అధిక వేతన ప్యాకేజీలకు మాత్ర మే పరిమితం కాకూడదని, సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించ గల సామర్థ్యానికి ఈ డిగ్రీ ఒక అంతర్జాతీయ గుర్తింపు అని అభివర్ణించారు. నిజజీవితంలో ఎదురయ్యే పెద్దసమస్యలు ఎప్పుడూ సిలబస్‌కు వెలుపల ఉంటాయని, వాటిని సంక్లిష్టంగా భావిస్తే ఎప్పటికీ జీవితంలో ఎదగలేమన్నారు. దేశంలో ప్రస్తుతం స్టార్టప్ విప్ల వం ఊపందుకుందని, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎందరో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగారని కొ నియాడారు.

ఇప్పుడు ‘చిప్స్ నుంచి షిప్స్ వరకు’ ప్రతీది దేశంలో యువత చేతుల మీ దుగా తయారవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. పరిశోధనా రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’, ‘ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్‌ఫెలోషిప్’ పథకాలను అమ లు చేస్తున్నదని వివరించారు. ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ డ్రైవ్ ద్వారా చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు సైతం అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు.

‘వికసిత్ భారత్’ నిర్మాణంలో యువ తదే ముఖ్యపాత్ర అని, ప్రతిఒక్కరూ దేశ శ్రే యస్సుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. వచ్చే 30- 35 ఏళ్లలో యువత ఏం చేయబోతున్నదన్నది వికసిత్ భారత్‌ను నిర్ణయిస్తుందని, అందుకే యువత నిర్ణయం దేశానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలన్నారు.