21 May, 2026 | 3:49 AM

గుర్తుతెలియని మహిళ మృతి

21-05-2026 12:06 AM

మేడిపల్లి, మే 20 (విజయక్రాంతి): గుర్తుతెలియని వృద్ధురాలు అనాథాశ్రమంలో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్వారకానగర్‌లోని భారతమత సోషల్ సర్వీస్ అనాథాశ్రమంలో 18న సాయంత్రం అనారోగ్యంతో మైసమ్మ(75) మృతి చెందింది.

ఈ వృద్ధురాలిని 2025 సంవత్సరంలో మేడిపల్లి ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు ఆశ్రమంలో చేర్పించారు. మృతురాలు సుమారు 5.5 అడుగుల ఎత్తు, బ్లూ కలర్ చీర, తెల్లటి తల వెంట్రుకలు ఉన్నాయి. ప్రాథమికంగా అనారోగ్యంతో చనిపోయినట్టుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి సంబంధీకులు ఎవరైనా ఉంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ శంకరయ్య తెలిపారు.