17 August, 2026 | 10:41 PM

సొంతింటి కలను సహకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

17-08-2026 09:34 PM

ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు.

భూపాలపల్లి /మహాదేవపూర్ ఆగస్టు 17 విజయక్రాంతి: మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన స్వరూప కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు పూర్తికావడంతో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కట్కం  అశోక్ పాల్గొని, నూతన గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.సొంతింటి కల సాకారం కావడంతో స్వరూప కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కృషి చేస్తున్న మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కట్కం అశోక్ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మంత్రి శ్రీధర్ బాబు  కృషికి కృతజ్ఞతలు తెలిపారు.