17 August, 2026 | 8:13 PM

ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించాలి

17-08-2026 07:03 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): 108-భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,958 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,18,991, మహిళలు 1,22,961, థర్డ్ జెండర్లు 6 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 6 మంది, సర్వీస్ ఓటర్లు 206 మంది ఉన్నారు.

ఓటర్లు తమ పేరు, చిరునామా వివరాలను పరిశీలించుకోవాలని రాహుల్ శర్మ సూచించారు. పేరు నమోదు కాకపోవడం, అభ్యంతరాలు లేదా వివరాల్లో మార్పులు ఉంటే సెప్టెంబర్ 16లోగా సంబంధిత ఫారాల ద్వారా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.